లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద శిబిరం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 14 : లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో శనివారం కట్టంగూర్ 4వ వార్డులోని కోటమైసమ్మ బజారులో వార్డు సభ్యురాలు ఏకుల సుజాత సైదులు సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వంద మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసిన సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి కల్లూరి వ వెంకటేశ్వర్లు, సలహాదారులు రెడ్డిపల్లి సాగర్, బొడ్డుపల్లి వెంకన్న, జాయింట్ సెక్రటరీ పొగుల రాములు, శ్రీపాద నందకుమార్, శ్రీపాద రామకృష్ణచారి, రాపోలు వెంకటేశ్వర్లు, గ్రామీణ వైద్యులు చిత్రం నర్సింయ్మా, బంటు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...