వెల్దండలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు.. డాక్టర్ విజితా రెడ్డి

1001412982.jpg

వెల్దండ నవంబర్ 29: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ ఒక కీలక ఘట్టమని తెలంగాణ ఉద్యమకారిణి, కల్వకుర్తి మాజీ బీఆర్ఎస్ ఇన్‌చార్జి డాక్టర్ విజితా రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి, వెల్దండ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం తెలంగాణ ఉద్యమ ఘట్టాల ఫొటో ప్రదర్శనను సందర్శించారు. కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని, ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని విజితా రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాం, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, సర్పంచ్ బచ్చలకూర శ్రీను, జంగిలి ఆనంద్, నరసింహ,గండికోట రాజు, హనుమంతు,లింగం,ముదిరాజ్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి,ఆనంద్, దేవేందర్,శేఖర్,అశోక్, అంజి మాస్టర్,సాజ్యా నాయక్,రాజు నాయక్,ఎంఎస్ గౌడ్,ప్రభాకర్, వెంకట్,లాలయ్య తదితర నాయకులు,కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు పాల్గొన్నారు.

You may also like...