Monthly Archive: October 2026

సింగాపురం బైపాస్‌ రోడ్డు లో ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగాపురం బైపాస్‌ రోడ్డుపై ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సింగాపురానికి చెందిన బండారి మొగులయ్య అలియాస్‌ బేగరి మొగులయ్య (48) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో...

ఎస్సీ రోస్టర్‌లో మాలలకు అన్యాయం: అయ్యాల సంతోష్

ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానం వల్ల మాలలకు విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యాల సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోస్టర్‌లో మాలలకు 10వ పాయింట్‌లోపు కేటాయించాలని, విధానాన్ని సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహించి,…

కోట దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ సురేష్ షెట్కార్

బాన్సువాడ కోటగల్లిలోని శ్రీ కోట దుర్గమ్మ ఆలయాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రశేఖర్, పత్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

లింగారెడ్డిపల్లిలో ఘనంగా LPL-5వ సీజన్ ప్రారంభం

వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ (LPL) 5వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ నిర్వాహకులు నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారు, మైలా అల్వాల్ రెడ్డి గారు, మైలా హాన్మంత్ రెడ్డి గారు, గ్రామ ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సర్పంచ్ ల సంఘం…

అంబరాన్నింటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బతుకమ్మ సంబరాలు

కల్వకుర్తి అక్టోబర్ 17: కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రథమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటలు, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ పోటీలు నిర్వహించి, తల్లులతో కలిసి బతుకమ్మ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ బొల్లె పర్వతాలు, మండల కో-ఆర్డినేటర్ సృజన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళలు పాల్గొన్నారు.

సంకేపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు – ఘనంగా అన్నదాన కార్యక్రమం

సంకేపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు – ఘనంగా అన్నదాన కార్యక్రమంసంకేపల్లి:సంకేపల్లి గ్రామంలో తొలిసారిగా శ్రీ దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించి, భక్తులు దుర్గామాలలు ధరించి నిత్యం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రతిష్టాపన జరిగి నేటికి 7 రోజులు పూర్తయిన సందర్భంగా, శ్రీ రామాలయ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో మొదటిసారిగా…

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్ 18 : దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆకాంక్షించారు. మండలంలోని పరడ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై…

భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ

భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను మండలవ్యాప్తంగా మహిళలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, ఆయా గ్రామాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మండలంలోని కల్మెర గ్రామంలో ఉత్తమ బతుకమ్మలను పేర్చిన మహిళలకు…

మధు గౌడ్ యాష్కీకి ఘన సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట, డీసీసీ అధ్యక్షుడు ఏలే!

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్మన్‌గా నూతన బాధ్యతలు స్వీకరించిన మధు గౌడ్ యాష్కీకి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధు గౌడ్ యాష్కీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.AIPC చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మధు గౌడ్ యాష్కీ నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతం కావాలని, వృత్తి నిపుణులను కాంగ్రెస్ పార్టీకి మరింత…

సోమవారం ప్రజావాణి రద్దు

జనగామ: దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వ సెలవు (OH) ఉన్నందున ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు. తమ వినతులు, ఫిర్యాదుల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆయన కోరారు.