కాలం మారినా.. తరాలు మారినా.. పండుగ సాయన్న కీర్తి చిరస్థాయే!:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

జ్ఞానతెలంగాణ, వెబ్ డెస్క్ :

కాలం మారినా.. తరాలు మారినా.. ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా పండుగ సాయన్న పేరు చిరస్థాయిగా నిలుస్తుందని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పండుగ సాయన్న జీవితం ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తరతరాలకు ఆయన స్ఫూర్తిదాయకమని తెలిపారు. సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేందుకు, అన్యాయాలను ఎదుర్కొనేందుకు పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం ద్వారా ఆయన ఆశయాలను, పోరాట పటిమను స్మరించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం నాయకులు, పండుగ సాయన్న అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

You may also like...