రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్మన్గా నూతన బాధ్యతలు స్వీకరించిన మధు గౌడ్ యాష్కీకి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధు గౌడ్ యాష్కీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.AIPC చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మధు గౌడ్ యాష్కీ నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతం కావాలని, వృత్తి నిపుణులను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా ముందుకు సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మర్యాదపూర్వక భేటీతో నాయకుల మధ్య పరస్పర శుభాకాంక్షలు, అభినందనలు వెల్లివిరిశాయి.