భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ

భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను మండలవ్యాప్తంగా మహిళలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, ఆయా గ్రామాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మండలంలోని కల్మెర గ్రామంలో ఉత్తమ బతుకమ్మలను పేర్చిన మహిళలకు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కట్టంగూర్‌ కింగ్స్‌ సభ్యులు, అనుకుంటే లో స్థానిక సర్పంచ్ గుల్లి నరేష్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు1000382422.jpg

You may also like...