పోలీసులంటే భయం కాదు.. భరోసా : కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్

పోలీసులంటే భయం కాదు.. భరోసా : కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 23: పోలీసులంటే భయం వీడి, ఆపదలో అండగా నిలిచే వ్యవస్థగా వారిని గుర్తించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సాందీపని పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాల పనితీరును వివరించారు. మహిళల భద్రతకు సంబంధించిన షీ టీమ్స్, భరోసా కేంద్రాల సేవలను పరిచయం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే విధానాన్ని వివరించి, విద్యార్థుల్లో పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే చట్టాలపై అవగాహన కల్పిస్తే సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడుతుందని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాధారపు అంజయ్య, పోలీస్ సిబ్బంది తవిడ బోయిన రామ్మోహన్, గంట శంకర్, రవీందర్ రెడ్డి, అనూష తదితరులు పాల్గొన్నారు.1000389296.jpg

You may also like...