రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) కోహీర్ మున్సిపల్, మండల పరిధిలో నిర్వహించిన 768వ ఉర్స్ షరీఫ్ వేడుకల్లో మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డా. ఏ. చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పవిత్ర చాదర్ సమర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉర్స్ షరీఫ్ వేడుకలు మత సామరస్యం, సోదరభావం, ఐక్యత, మానవత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. సమాజంలో ఈ గొప్ప విలువలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఉర్స్ షరీఫ్ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం,సుఖసంతోషాలు కలగాలనిప్రార్థించారు.ఈకార్యక్రమంలో కోహీర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మండల అధ్యక్షులు సువర్ణ–మల్లన్న పాటిల్, పట్టణ అధ్యక్షులు ముజఫర్, వైస్ చైర్మన్ హన్నన్ జావీద్, మాజీ పట్టణ అధ్యక్షులు శంషీర్ అలీ, కౌన్సిలర్లు అబ్దుల్ అహ్మద్, జగదీష్, మహేష్ కుమార్, శ్రీకాంత్, మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మాజీ వైస్ ఎంపీపీ షకీర్ అలీ, కాంగ్రెస్ నాయకులు అష్రాఫ్, మాజిద్, పరమేష్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.