​జడ్పీహెచ్‌ఎస్ దిగ్వాల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

 కోహీర్ మండలం, సంగారెడ్డి జిల్లా  22026: దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి మొహమ్మద్  జాకీర్ హుస్సేన్ హాజరు అయినూరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వం, సామాజిక న్యాయం మరియు విద్యా హక్కు చట్టం గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలైన విద్య, సమానత్వం, క్రమశిక్షణ మరియు సామాజిక న్యాయాన్ని విద్యార్థులు అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు.
​కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రాజ్యాంగ విలువలపై ప్రసంగించగా, పలువురు చిన్నారులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
​ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం. శ్రీనివాస్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర గౌడ్, రాంచందర్, భీంవంశీ, అశ్విని, మైకల శ్రీనివాస్, ఇఫ్తేకార్, బద్రుద్దీన్, ఆనంద్, చంద్రశేఖర్, లలిత, భార్గవి, బి.జి. విజయలక్ష్మి, వసంత్ రాజ్, ఫిజిక్స్ కవిత, హిందీ కవిత, అమ్తుల్ అంజుమ్, మాధవి, వసుధ, సమీనా, అబ్దుల్ ముజీబ్ మరియు జర్నప్ప తదితరులు పాల్గొన్నారు

You may also like...