సింగూర్ పైప్‌లైన్ లీకేజీ.. మూడు రోజలు నీటి సరఫరా బంద్

సింగూర్ 145 MLD హెడ్‌వర్క్స్ నుంచి వచ్చే PCCP ప్రధాన పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో నవంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సింగూర్ నీటిపై ఆధారపడిన అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో సరఫరాకు అంతరాయం కలగనుంది. ప్రజలు ముందుగానే తాగునీటిని నిల్వ చేసుకొని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. నీటి ఇబ్బందులు తలెత్తకుండా బోర్‌వెల్స్ ద్వారా సరఫరా, అవసరమైన చోట ట్యాంకర్ల ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించనున్నారు.

You may also like...