రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) జహీరాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతిని పురస్కరించుకుని జహీరాబాద్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో నాయకులు పూలే ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకురాలు జ్యోతి పండాల్, జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి. రాములు నేత, బీజేపీ రాష్ట్ర నాయకులు సుధీర్ బండారి, జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ అప్పం శ్రావణ్, కుల సంఘాల నాయకులు పల్లపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే బహుజనుల అభ్యున్నతి, మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో బీసీలు, అణగారిన వర్గాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి, బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.బీసీల ఐక్యతే బీసీల బలమని, అన్ని కుల సంఘాలు కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే మహాత్మా పూలే ఆశయాలు నెరవేరుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.