కల్యాణ్స్ పాఠశాలలోముందస్తు బతుకమ్మ వేడుకలు
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞానతెలంగాణ,పఠాన్ చెరు, అక్టోబర్ 09:
పఠాన్ చెరు మండలంలోని సాయి కాలనీలో కళ్యాణ్స్ పాఠశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలను ఎంతో సంప్రదాయంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఉత్తమ బతుకమ్మకు నిలిచిన 2వ తరగతి విద్యార్థి దేవులపల్లి వామిక శ్రీ వర్ష, ప్రిన్సిపాల్ థాకూరు కిన్నెర చేతుల మీదిగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కిన్నెర, మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ ప్రతీకగా ప్రకృతి పూల పండుగ బతుకమ్మ,అని అన్నారు. తెలంగాణ అంటేనే సాంప్రదాయలకు నిలయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శ్రీలత, జారిన, ఇంద్ర,భాగ్యశ్రీ, శిరీష, భాగ్యలక్ష్మి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
