రిపోర్టర్, సంగారెడ్డి | 8106005660
Latest posts by Kondagalla Sridhar
(see all) సంగారెడ్డి : మండలకేంద్రమైన హత్నూర గ్రామ పరిధిలో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో VBG-RAM-G ప్రోగ్రామ్లో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని వృధా చేయకుండా ఒడిసిపట్టడం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయవచ్చని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హత్నూర గ్రామ సర్పంచ్ నల్లోల్ల ఎల్లయ్య , డి ఎల్ పి మేడం , ఎంపీడీఓ , గ్రామ సెక్రటరీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, కొండేగల్ల రవి కుమార్, పొట్లగల్ల ప్రవీణ్ మరియు నల్లోల్ల ప్రభురాజ్ తదితరులు పాల్గొన్నారు.