ఝరాసంగం: విద్యార్థులకు చట్టాలపై అవగాహన

ఝరాసంగం మండలం మాచునూరులోని కేంద్రీయ విద్యాలయంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి జి. కవితాదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ, సాధారణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాలికల భద్రత, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌, బాల కార్మిక నిషేధ చట్టాలపై వివరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

You may also like...