కొల్లూరులో ఆధ్యాత్మిక సందడి.. ఘనంగా వనభోజన మహోత్సవం

 ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో వనభోజన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్ కోర్టు న్యాయమూర్తి, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్, ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్, గ్రామ పెద్ద రాచన్న స్వామి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, బంధుమిత్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక వనభోజన విందులో పాల్గొన్నారు. భక్తి పారవశ్యం, ఆధ్యాత్మిక శోభ, ఆనందోత్సాహాల మధ్య వనభోజన మహోత్సవం విజయవంతంగా ముగిసింది.

You may also like...