లక్ష్మీనగర్ కాలనీ పార్కులో ఓపెన్ జిమ్, ప్లే ఏరియాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

318701.jpg

అత్తాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీ ప్రజలకు సరికొత్త ఆరోగ్య, ఆహ్లాదకర సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కాలనీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్ మరియు చిన్నపిల్లల ఆట వస్తువులను రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ టి. ప్రకాష్ గౌడ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.

స్థానిక ప్రజల శారీరక దారుఢ్యం, ఆరోగ్యం అలాగే చిన్నారుల వినోదం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆధ్వర్యంలో ఈ ఆధునిక వసతులను కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. కాలనీవాసులు, ముఖ్యంగా వృద్ధులు మరియు మహిళలు ఈ ఓపెన్ జిమ్ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. చిన్నారుల మానసిక వికాసానికి, ఆహ్లాదానికి ఇటువంటి ప్లే ఏరియాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్కుల అభివృద్ధికి, ప్రజా సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

ఈ ఘన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక డివిజన్ నాయకులు మరియు కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తమ కాలనీ పార్కును ఇంత అందంగా తీర్చిదిద్ది, ఆట వస్తువులను అందుబాటులోకి తెచ్చినందుకు లక్ష్మీనగర్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...