జర్నలిస్ట్ రాము యాదవ్ తండ్రి హఠాన్మరణం.దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జర్నలిస్టులు మరియు ప్రముఖ నాయకులు.
- లక్ష్మీనగర్ కాలనీ పార్కులో ఓపెన్ జిమ్, ప్లే ఏరియాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ - October 13, 2026
- జర్నలిస్ట్ రాము యాదవ్ తండ్రి హఠాన్మరణం.దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జర్నలిస్టులు మరియు ప్రముఖ నాయకులు. - October 13, 2026
- మూసీ సుందరీకరణ అదనపు భూసేకరణ ఆపాలి మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బాధితుల వినతి - October 12, 2026

గండిపేట్ : వార్త దినపత్రిక విలేకరి రాము యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాము యాదవ్ తండ్రి గారు ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
రాము యాదవ్ పితృవియోగం పట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు, తోటి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు మరియు వివిధ సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శోకసముద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతుని ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
