సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసినజహిరాబాద్ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ పట్టణానికి  చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి  ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులనుజహిరాబాద్ శాసనసభ్యులు  మాణిక్ రావు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే. మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్న  కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప,మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ ,కౌన్సిలర్  అబ్దుల్లా, నాయకులు వెంకట్ భరత్ రెడ్డి,శివకుమార్ స్వామి,అశోక్ రెడ్డి ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..

You may also like...