నషా ముక్తి

కిషన్ రెడ్డి చేపట్టిన హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్


​డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన ‘హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో ఆయన ప్రత్యేకంగా పాల్గొని, కిషన్ రెడ్డితో కలిసి అడుగులు వేశారు.

​మత్తు పదార్థాల మహమ్మారి నుంచి దేశ యువతను, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ ప్రజా చైతన్య యాత్రలో బండి సంజయ్ భాగస్వాములై, ఉద్యమానికి మరింత ఉత్సాహాన్ని, బలాన్ని అందించారు.

You may also like...