ఓంనగర్ కాలనీలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి

441508.jpg

బండ్లగూడ జాగీర్ : ఓంనగర్ కాలనీలో గత కొంతకాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి నాయకులు ప్రత్యేక చొరవ చూపారు. ఈరోజు మాజీ కార్పొరేటర్ శ్రీమతి గోకరి శ్రీలత సురేష్ గౌడ్ కాలనీ ప్రెసిడెంట్ శ్యాములు గౌడ్ తో కలిసి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ని కలిశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న వివిధ విద్యుత్ సంబంధిత ఇబ్బందులను ఏఈ దృష్టికి తీసుకెళ్లి వాటిని తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన ఏఈ కాలనీలోని విద్యుత్ సమస్యలను రేపటి రోజున తప్పకుండా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న మాజీ కార్పొరేటర్ శ్రీలత సురేష్ గౌడ్ మరియు కాలనీ ప్రెసిడెంట్ శ్యాములు గౌడ్ కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...