యువత ఆర్థిక ఎదుగుదలే దేశ అభివృద్ధికి తొలిమెట్టు.. టాస్క్ సి బాబు శంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

1001260141.jpg

ఆమనగల్లు అక్టోబర్ 13 :యువత ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం,దేశం అభివృద్ధి చెందుతాయని టాస్క్ సీఓఓ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆమనగల్ పట్టణ కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ జాబ్ డ్రైవ్‌కు ఆయన హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కంపెనీల ప్రతినిధులను నేరుగా యువత వద్దకు తీసుకొచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యువతీ యువకులకు ఆయా కంపెనీలు బస్సు,ఉచిత భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని కంపెనీ ప్రతినిధి నిఖిల్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ సభ్యుడు చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఫాక్స్ అండ్ కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ నిక్, రిక్రూట్‌మెంట్ హెడ్ వీర, మహేష్,ఎల్‌ఎన్ కౌశిక్, మెడ్‌ప్లస్ హెచ్‌ఆర్ జగన్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, కొండల్ యాదవ్‌తో పాటు నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

You may also like...