సొంత నిధులతో రహదారి మరమ్మతులు.. మాజీ ప్రజా ప్రతినిధులు

1001311073.jpg

ఊర్కొండ అక్టోబర్ 29 :నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామం నుంచి రేవల్లి వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో రైతుల విజ్ఞప్తి మేరకు మాజీ సర్పంచ్ వీరెడ్డి పర్వత్ రెడ్డి, ఉపసర్పంచ్ మధు సాయి కిరణ్ రెడ్డి స్పందించారు. తమ సొంత నిధులతో రహదారిపై మట్టి పోయించి మరమ్మతు పనులు చేపట్టారు.రైతుల ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించి రహదారి అభివృద్ధికి సహకరించినందుకు గ్రామ రైతులు, పెద్దలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవాభావాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దారా జంగయ్య,మారుపాకుల శ్రీనివాస్ గౌడ్,బర్ల పాండు,పల్లె కేశవులు గౌడ్,దారా బంగారయ్య,నీరటి ఆంజనేయులు,కుడుముల బుచ్చిరెడ్డి,వెల్జాల్ జంగయ్య, కొప్పుల శ్రీశైలం,వెల్జాల్ మహేష్‌తో పాటు గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

You may also like...