సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు - October 9, 2026
- సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌కు వీధి వ్యాపారుల నుంచి విశేష స్పందన - October 9, 2026
- హైదరాబాద్ రవీంద్రభారతిలో 6TV రిపోర్టర్ కు ఘన సత్కారం - October 9, 2026

జనగామ పట్టణంలోని నెహ్రూపార్క్ సమీపంలో, డీసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న సెయింట్ మేరీస్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను చాటుతూ పాఠశాలలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పద్మశ్రీ దేవి, ప్రిన్సిపాల్ బాసాని శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
