ఆమనగల్ లో ఘనంగా 70వ SGFI జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
- తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు - September 24, 2026
- తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు - September 24, 2026
- అచ్చంపేటలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం - September 24, 2026
కల్వకుర్తి / ఆమనగల్: రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని బాలుర ఉన్నత పాఠశాల (Z.P.H.S) లో 70వ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జోనల్ స్థాయి అండర్-14, అండర్-17 వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమనగల్ మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి తల్లోజు గీతా ఆచారి గారు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా గీతా ఆచారి గారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్, పోలీస్ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జోనల్ స్థాయి పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. పోటీలు క్రీడాస్ఫూర్తితో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతు
న్నాయి.
