పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.. సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్

1001353403.jpg

వెల్దండ, నవంబర్ 12: పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, ప్రజా సంక్షేమలో పాలనలో మాకు మేమే పోటీ మాకు మేమే సాటి మా తోటి పోటీ రారెవరు అని వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు.కేంద్రానికి చెందిన కొమర లింగమ్మ – అంజయ్య కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం సర్పంచ్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, మత్స్యకార సొసైటీ జిల్లా డైరెక్టర్ క్యాసరపు వెంకటయ్య ముదిరాజ్, ఉపసర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

You may also like...