రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ఎస్.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారు పాల్గొన్నారు. విద్యారంగానికి, సమాజ సేవకు ఆయన అందిస్తున్న విశేష సేవలు, దాతృత్వం, సేవా కార్యక్రమాల పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా, విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తన సొంత నిధులతో బీబీపేటలో ప్రభుత్వ పాఠశాలను నిర్మించి విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు చేసిన కృషికి గాను ఈ కార్యక్రమంలో శ్రీ సుభాష్ రెడ్డి గారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, ప్రభుత్వ సలహాదారు శ్రీ కె. కేశవరావు గారు, ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్సీ శ్రీ శ్రీపాల్ రెడ్డి గారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు శ్రీ సుభాష్ రెడ్డి గారు విద్యారంగానికి అందిస్తున్న సేవలను, ఆయన దాతృత్వాన్ని, సమాజ హితం కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్య ద్వారానే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమనే దృక్పథంతో, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఆయన సేవా స్ఫూర్తిని కొనియాడారు.