,తిమ్మాపూర్ తిరుమలలో ప్రత్యేక పూజలు.. పోచారం, అకాడమిక్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దర్శనం
- ,తిమ్మాపూర్ తిరుమలలో ప్రత్యేక పూజలు.. పోచారం, అకాడమిక్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దర్శనం - September 30, 2026
- సేవా సంకల్పంతో.. అంగన్వాడీ సిబ్బందికి సన్మానం - September 29, 2026
- ప్రజల నమ్మకమే జర్నలిస్టులకు రక్షణ – ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి - September 29, 2026
బాన్సువాడ, సెప్టెంబర్ 30: తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పోచారం వివరించారు. తిమ్మాపూర్ ఆలయాన్ని “తెలంగాణ తిరుపతి”గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇరువురిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాత్రికేయులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
