భైరాపూర్‌లో డెంగ్యూ పాజిటివ్ కేసు… అప్రమత్తమైన వైద్య సిబ్బంది

భైరాపూర్ గ్రామంలో ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు గుర్తించడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. కేసు నమోదైన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 60 ఇళ్లను పరిశీలించి, ప్రజల ఆరోగ్య పరిస్థితులతో పాటు దోమల వృద్ధికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు.గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కేసు పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్‌ స్ప్రేయింగ్ చేపట్టారు. నిల్వ నీరు, పరిసరాల్లో అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలని, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజలకు సూచించారు.డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో MLHP కె. ప్రీతి, ANMలు జాన్షి, కావ్య, ఆశా కార్యకర్త రుక్మిణి, ఉప సర్పంచ్ అజయ్, గ్రామ కార్యదర్శి కృష్ణ కుమారి పాల్గొని డెంగ్యూ నివారణ చర్యలను పర్యవేక్షించారు.

You may also like...