రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
సిజేరియన్ ప్రసవాలు తగ్గించి, సాధ్యమైన సందర్భాల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని మాతా శిశు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ప్రకాష్ రాథోడ్ సూచించారు. సొసైటీ ఆఫ్ మిడ్వైఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రి నర్సింగ్ కళాశాల నిర్వహించిన ఆఫర్ బర్తింగ్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గర్భిణులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, నార్మల్ డెలివరీలపై ఉన్న అపోహలను తొలగించుకొని తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ అను ప్రణతి మాట్లాడుతూ సిజేరియన్ కేసులు పెరుగుతున్నాయని, నార్మల్ డెలివరీలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ కాసుల విజయమ్మ, కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్ కలేక్, కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, సుల్తానా గౌస్ పాల్గొన్నారు. అనంతరం మాతా శిశు ఆసుపత్రి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, నర్సింగ్ అధ్యాపకులు, విద్యార్థినులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.