పేదలకు భరోసా ఇందిరమ్మ బీమా: కమిషనర్ గోపూ గంగాధర్

బాన్సువాడ, జ్ఞాన తెలంగాణ: బాన్సువాడ పట్టణంలోని 5వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ గోపూ గంగాధర్, కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబంలోని ఒకరు ఈ పథకానికి అర్హులని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి, సయ్యద్ ఇలియాస్ అలీ, యూత్ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్, వార్డు ఆఫీసర్ నవిత, సాయి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

You may also like...