రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) ఐదు ట్రోఫీలు, 28 అథ్లెటిక్స్ పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు… కామారెడ్డి జిల్లా పాల్వంచ: మండల స్థాయిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) క్రీడా పోటీల్లో ఆర్ఆర్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయాలు సాధించారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు మొత్తం ఐదు ట్రోఫీలతో పాటు అథ్లెటిక్స్ విభాగంలో 28 పతకాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. విద్యార్థులు క్రీడల్లో చూపిన ప్రతిభ, పట్టుదల, క్రమశిక్షణకు ఈ విజయాలు నిదర్శనంగా నిలిచాయి. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు . నరేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విజేత విద్యార్థులను అభినందించింది. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. విద్యార్థుల విజయాల పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
