ఓటు హక్కును ప్రతి గ్రాడ్యుయేట్ వినియోగించుకోవాలి. – సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్.
- అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేత - October 30, 2026
- ఎనిమిదేళ్ల తర్వాత గౌరారానికి ఆర్టీసీ బస్సు.. విద్యార్థుల హర్షం - October 30, 2026
- చలో ఢిల్లీ రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా.. తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు - October 30, 2026

వెల్లడం అక్టోబర్ 30: గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ పిలుపునిచ్చారు.శుక్రవారం వెల్దండ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. కార్తీక్ కుమార్ కి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు పత్రాలను సర్పంచ్ ఆధ్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవడం తమ బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని తెలిపారు. గ్రామంలోని అర్హులైన పట్టభద్రులందరూ ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు చివరి తేదీ లోపు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొయ్యల పుల్లయ్య, రేవల్లి రాజు, బొక్కల శ్రీను , మట్ట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
