ఎనిమిదేళ్ల తర్వాత గౌరారానికి ఆర్టీసీ బస్సు.. విద్యార్థుల హర్షం
- అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేత - October 30, 2026
- ఎనిమిదేళ్ల తర్వాత గౌరారానికి ఆర్టీసీ బస్సు.. విద్యార్థుల హర్షం - October 30, 2026
- చలో ఢిల్లీ రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా.. తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు - October 30, 2026

తెలకపల్లి అక్టోబర్ 30: తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి ఎనిమిదేళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు పునఃప్రారంభమైంది. గ్రామం నుంచి తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌కు వెళ్లే విద్యార్థులు, ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటూ కిలోమీటరు దూరం నడిచి బస్సు ఎక్కేవారు.ఈ సమస్యను గ్రామ సర్పంచ్ బిరుదు మల్లీశ్వరి–రఘుకుమార్, ఉపసర్పంచ్ బోయ మల్లేష్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే కల్వకుర్తి ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడి బస్సు పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. అనంతరం గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులకు ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేశారు.గురువారం బస్సు గ్రామంలోకి చేరుకోవడంతో విద్యార్థులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్థులు కొబ్బరికాయలు కొట్టి బస్సుకు స్వాగతం పలికారు.
