జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్‌కు నూతన నియామకాలు

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ వేముల మల్లేష్ మహారాజ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ నియామకాలు చేపట్టారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు 15 మందికి వివిధ బాధ్యతలు అప్పగించారు. వైస్ చైర్మన్లు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధి, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలను నియమించారు. అలాగే బచ్చన్నపేట మండల, జనగామ పట్టణ ఎస్సీ సెల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించారు. నూతన నాయకులు కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వేముల మల్లేష్ మహారాజ్ సూచించారు.

You may also like...