మట్టి గణపతులనే పూజించాలి : రామడుగు శ్రీనివాస శర్మ
- మట్టి గణపతులనే పూజించాలి : రామడుగు శ్రీనివాస శర్మ - September 13, 2026
- కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం - September 11, 2026
- మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామల - September 11, 2026
ట్టంగూర్, సెప్టెంబర్ 13: పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని కట్టంగూర్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రామడుగు శ్రీనివాస శర్మ, నాయకులు మిట్టపల్లి శివశంకర్ పిలుపునిచ్చారు. వైఆర్పీ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎలిశాల రవి ప్రసాద్, ఆర్గనైజర్ యామా దయాకర్ సహకారంతో ఆదివారం కట్టంగూర్‌లో 500 మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మట్టి విగ్రహాల నిమజ్జనంతో నీటి వనరులు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడవచ్చన్నారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల చెరువులు, నీటి వనరులు కలుషితమవుతున్నాయని తెలిపారు. పర్యావరణహితంగా పండుగ నిర్వహించాలనే ఉద్దేశంతో రవి ప్రసాద్ ఏళ్లుగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఇల్లందుల కృష్ణమూర్తి, మిట్టపల్లి శ్రీనివాస్, కొల్లూరు శివప్రసాద్, గడగోజు రఘుమాచారి, గాధగోని వెంకన్న, ముక్కామల శీను, సుంకరబోయిన అశోక్, చింతల సైదులు తదితరులు పాల్గొన్నారు.

