హైదరాబాద్ రవీంద్రభారతిలో 6TV రిపోర్టర్ కు ఘన సత్కారం
- సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు - October 9, 2026
- సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌కు వీధి వ్యాపారుల నుంచి విశేష స్పందన - October 9, 2026
- హైదరాబాద్ రవీంద్రభారతిలో 6TV రిపోర్టర్ కు ఘన సత్కారం - October 9, 2026

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్ రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పీపుల్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6TV జనగామ జిల్లా రిపోర్టర్ తిప్పారపు ఉపేందర్‌కు పురస్కారం-2026 అందజేశారు. జర్నలిజం రంగంలో విశేష సేవలందించినందుకు నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించి అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాబు మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిజం రంగంలో ఉపేందర్ అందిస్తున్న సేవలను పలువురు అభినందించారు. ఈ సత్కారం పట్ల మీడియా వర్గాల్లో హర్షం వ్యక్తమైంది.
