మారేపల్లి బాబు మృతి పార్టీకి తీరని లోటు

జఫర్‌గఢ్ మండలం వడ్డేగూడెం గ్రామానికి చెందిన సీపీఎం, ప్రజా సంఘాల కార్యకర్త మారేపల్లి బాబు ఆదివారం సాయంత్రం మృతి చెందారు. మిల్లు మేస్త్రీగా పనిచేస్తూనే సీపీఎం మండల కమిటీ సభ్యుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సోమవారం ఆయన భౌతికకాయానికి సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు మృతి పార్టీకి, ప్రజా సంఘాలకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాపర్తి సోమయ్య, కాట సుధాకర్, సాగి నర్సింగ్, బి.చిరంజీవి, ఎం.డి.హలీం, ఎం.డి.పాషా, వెంకటేష్, ఎం.డి.ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...