పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు
- జనగామ బీరప్పగడ్డలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ నిమజ్జనం - October 22, 2026
- చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి - October 22, 2026
- పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు - October 22, 2026
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జనగామ పట్టణంలో పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఐపీఎస్ ఆధ్వర్యంలో Ci జనగామ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల రక్షణ కోసం వారు చేసిన సేవలు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
