చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండలం చిన్న రాంచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.WhatsApp Image 2026-10-21 at 20.43.39.jpeg

You may also like...