చిరు వ్యాపారుల జీవనోపాధి కాపాడండి: బీజేపీ నేత తల్లోజు ఆచారి డిమాండ్
ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, తమను ఆదుకోవాలని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు వేడుకున్నారు.షాద్‌నగర్ రహదారిలో డబ్బాలను తొలగించడం ద్వారా వారి జీవనోపాధి కోల్పోయి ఇతర గ్రామాలకు వలస వెళ్లారని, వారికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి జీవనోపాధి కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న డబ్బాలను తొలగిస్తే తాము కూడా…
