నగారా బేరి లంబాడి హక్కుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్

నగార బేరి లంబాడి హక్కుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్

నాగర్ కర్నూల్: నగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు లెజెండ్ డాక్టర్ ధరావత్ గణేష్ నాయక్ న్యాయకత్వంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ ఏకగ్రీవంగా నియమించడం జరిగింది.నాయకులకు లంబాడి గిరిజన నాయకులకు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.గిరిజన నాయకులకు గిరిజన విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలబడి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.మొట్ట మొదటి ఎజెండా గిరిజన తండాలలో ఏ సమస్య లేకుండా పరిశీలించడం రోడ్లు త్రాగడానికి నీరు ఉండడానికి ఇల్లు లేనివారికి పరిశీలించి ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు నివేదిక అందించి న్యాయం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.అలాగే గిరిజన తాండాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన వారికి పరిశీలించి ఉపాధి కల్పించడం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1001218484.jpg

You may also like...