చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలని నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ ధర్నా
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026

కల్వకుర్తి : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటానికి నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి, వెల్దండ, కల్వకుర్తి, చారకొండ ప్రాంతాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన నివాసంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్య నాయకుల సమక్షంలో సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.
