ఎన్నికల కమిషనర్ ను తొలగించాలని కాంగ్రెస్ నిరసన

నాగర్ కర్నూల్ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో బిజెపి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ను చేతిలో పెట్టుకొని 25 కోట్ల ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతుందని, రాజ్యాంగ పరిరక్షణ విలువలకు విఘాతం కలిగిస్తుందని, ఇలాంటి చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని,వెంటనే ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ ఎన్నికల సంఘం జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలని వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూచకూళ్ళ రాజేష్ రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కమిటీ సభ్యులు బాలాజీసింగ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, డిసిసి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ముఖ్య నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1001218425.jpg

You may also like...