విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బివిపేట ఎస్సై సూచన…
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదువుకోవాలని ఎస్సై నవీన్ చంద్ర సూచించారు. ఆదివారం పోలీస్టేషన్లో ఓపెన్హాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, ఆయుధాల వినియోగం, సమాజంలో పోలీసుల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
