అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ
- పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ తీసుకోవాలి - November 25, 2026
- ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల శేఖర్ - November 25, 2026
- అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ - November 25, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్,నవంబర్ 25 : మండల కేంద్రంలోని సాయి మణికంఠ దేవాలయంలో అయ్యప్ప దీక్ష స్వీకరించిన స్వాములకు మునుకుంట్ల మాజీ సర్పంచ్ గడుసు అనిత సుధీర్ రెడ్డిల వివాహ దినోత్సవ సందర్భంగా బుధవారం భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో వారి పేరిట పూజల అనంతరం వివాహ దినోత్సవము జరుపుకుంటున్న దంపతులను పూలమాలలతో సత్కరించి అయ్యప్ప స్వాములు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ తరఫున జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ గురు స్వామి పూల స్వామి మాట్లాడుతూ స్థానిక అయ్యప్ప ఆలయంలో శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయ సాంప్రదాయం ప్రకారం దీక్షా సమయంలో మండల కాల పూజలు నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు 41 రోజులపాటు ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాన్ని దాతలు సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమం తో పాటు ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ గడుసు శంకర్ రెడ్డి, ఆలయ పూజారి కొటారు సత్యనారాయణ శర్మ,, గురుస్వాములు కానుగు లక్ష్మీనారాయణ, పొట్ట బత్తుల కృష్ణమూర్తి, మండల వెంకన్న, కొంపెల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
