పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ తీసుకోవాలి
- పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ తీసుకోవాలి - November 25, 2026
- ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల శేఖర్ - November 25, 2026
- అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ - November 25, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 25 : పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజులామాధవరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మునుకుంట్ల గ్రామంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పశువైద్య శిబిరాన్ని ఆమె జిల్లా పశువైద్య, సంవర్ధశాఖ అధికారి వి. రమేష్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పశువులకు సకాలంలో వైద్యం, అవసరమైన పోషకాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెంచుకోచ్చన్నారు. పాడి రైతులకు అండగా నిలవడంతో పాటు పశువుల ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. 19 గేదెలకు గర్భ సంబంధిత వ్యాధులకు చికిత్స చేసి 20 గేదెలకు పరీక్షలు నిర్వహింది ఎద టాబ్లెట్స్ అందజేశారు. పాల ఉత్పతిని పెంపొందించేందుకు మినరల్ మిక్చర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గుల్లి నరేష్, ఉప సర్పంచ్ మల్లేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారు కృష్ణ, పశువైధికారి రవి, ఎల్ఎస్ఏ అరుణ, సిబ్బంది కిరణ్, గోపాలమిత్ర యాదయ్య, రైతులు పాల్గొన్నారు.
