ఇర్విన్-ఆమనగల్లు డబుల్ రోడ్డుకు నిధులు ఇవ్వండి – కేంద్ర మంత్రికి ఆచారి వినతి
మాడ్గుల:మాడ్గుల మండలం ఇర్విన్ నుంచి కలకొండ, చంద్రాయన్ పల్లి, మాల్లేపల్లి గ్రామాల మీదుగా ఆమనగల్లు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని కోరారు.ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇర్విన్ – ఆమనగల్లు మధ్య డబుల్ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…
