ఆమనగల్లులో 70వ ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన..తల్లోజు ఆచారి
- కలం మిత్రుల అభినందన..! చైర్మన్ భూపతి రెడ్డికి పాత్రికేయుల ఘన సన్మానం..! - November 7, 2026
- ఆమనగల్లులో 70వ ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన..తల్లోజు ఆచారి - November 7, 2026
- కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిని సన్మానించిన విజేందర్ యాదవ్ - November 7, 2026

ఆమనగల్లు,నవంబర్ 07: ఆమనగల్లు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 70వ ఎస్జీఎఫ్ రంగారెడ్డి జిల్లా స్థాయి అండర్-14 బాలబాలికల వాలీబాల్ పోటీలు, ఎంపికల కార్యక్రమం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ,పట్టుదల, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయి పోటీలకు ఎంపిక కావాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు,విద్యాశాఖ ప్రతినిధులు,నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
