రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) కొడంగల్‌లో ఇండస్ట్రియల్ హబ్‌కు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
కొడంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)లో భాగంగా హకీంపేటలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 943.34 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ హబ్ ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించనున్నారు. భూసేకరణకు రూ.220 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.441.91 కోట్లు కేటాయించారు. ఇప్పటికే బిర్లాను లిమిటెడ్, ఎకోపామ్ సంస్థలకు 96 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు సంస్థలు రూ.252.86 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేయనుండగా, సుమారు 535 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. స్థానిక యువతకు సొంత ప్రాంతంలోనే ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
