జనగామ జిల్లా: పాలకుర్తి పరిసర మండలాల ప్రజలకు సీఐ భరత్ సుమన్ ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన హెచ్చరించారు.